కనీసం హైద‌రాబాద్‌ మేయర్‌ను కూడా పట్టించుకోలేదు: వీహెచ్‌

  • హైదరాబాద్‌లో జ‌రిపిన జీఈ స‌ద‌స్సు తీరుపై ఆగ్ర‌హం
  • మేయ‌ర్ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా?
  • తెలంగాణ మంత్రి కేటీఆర్‌ షోగా నడిచింది
  • ఇత‌ర‌ నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించారు
హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో జ‌రిగిన ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల సదస్సును తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించిన తీరుపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ హనుమంతరావు త‌ప్పుప‌ట్టారు. అది తెలంగాణ మంత్రి కేటీఆర్‌ షోగా నడిచిందని ఎద్దేవా చేశారు. ఈ సదస్సులో ఇత‌ర‌ నేతలను భాగస్వామ్యం చేయకుండా అవమానించార‌ని ఆయ‌న అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం హైద‌రాబాద్ మేయ‌ర్ రామ్మోహ‌న్ రావును కూడా పట్టించుకోలేదని, ఆ పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిల‌దీశారు. జీఈ సదస్సుకు వ‌చ్చిన అమెరికా అద్యక్షుడి కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్‌కు ప్ర‌భుత్వం అవాస్తవాలు చెప్పుకుంద‌ని, వాస్తవాలు తెలుసుకోవాలని ఆమెకు తాము లేఖ రాశామని ఆయ‌న అన్నారు.
Go Back to Shorts
Hyderabad
mayor
vh

More Telugu News